తునికి పళ్ళకు భలే గిరాకి
– ఔషధ ఆరోగ్య గుణాలు కలిగిన తునికి పళ్ళు అడవుల్లో విరివిగా లభ్యం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి: అడవుల్లో తునికి చెట్లకు విరివిగా కాసే తునికి పళ్ళు ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో ఏజెన్సీలో పుష్కలంగా లభిస్తుంటాయి. ప్రకృతి ప్రసాదించిన తునికిపళ్లను ప్రజలు తినేందుకు ఆసక్తి చూపు తుంటారు. డిసెంబర్, జనవరి నెలలలో పూత, పిందె వచ్చి కాయ పండుగా మారి, పక్వానికి వచ్చిన తర్వాత చెట్టుకింద రాలిపోతుంటాయి. వేకువ జామునే సమీపంలో ఉన్న అడవు ల్లోకి వెళ్లి, తునికి పళ్ళను ఏరుకొని గ్రామాలలో, సంతలలో, వీధుల్లో తిరుగుతూ గిరిజనులు విక్రయిస్తుంటారు. ఒక డబ్బా పళ్ళు రూ. 10 వంతున విక్రయిస్తుంటారు. తునికి పళ్ళ ఔషధ గుణాలు, ఆరోగ్యకరమైన గుణాలు కలిగి ఉండటంతో పలువు రు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. షుగర్, బిపి, కిడ్నీ, లివర్, రక్తశుద్ది ఇతర వ్యాధులకు తునికి పళ్ళు ఎంతో ప్రయోజన కారిగా ఉంటాయని, కొలెస్ట్రాల్ శాతం కూడా ఘనంగా తగ్గిపోతుందని, పలు ఆయుర్వేద వైద్య నిపుణులు, డాక్టర్లు సైతం చెబుతుంటారు. అయితే తునికాకు సీజన్ ప్రారం భానికి ముందే తునికి పొదలు ప్రతి ఏడాది ఆకుల కోసం ఫారెస్ట్ శాఖ కూలీలతో మండకోట్టే పనులు చేస్తుంటారు. దీంతో తునికి చెట్ల సంతతి గణణీయంగా తగ్గిపోతుంది.