తిమ్మన కుంట స్థలాన్ని కాపాడాలి
– మినీ స్టేడియం నిర్మాణం ఉత్త కథేనా..?
– సబ్ కలెక్టర్ కు వినతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు ఎకరాల 25 గుంటల తో ఉన్న తిమ్మన కుంట స్థలాన్ని పరిరక్షించాలని కాటారం సబ్ కలెక్టర్ కు జక్కు శ్రావన్ యువకుడు ఫిర్యాదు చేశారు. కొందరు భూకబ్జాదారులు ఇండ్లు నిర్మిస్తున్నారని, ఆ స్థలంలో మినీ స్టేడియాన్ని నిర్మించాలని అధికారులను కోరారు గత ప్రభుత్వ కాలంలోనే మినీ స్టేడియం కొరకు తిమ్మన కుంట స్థలాన్ని కేటాయించారని, అధికారులు మినీ స్టేడియం నిర్మాణం కోసం దృష్టి సారించకపోవడంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఫోర్ మెన్ కమి టీని నియమించి అక్రమనకు గురికాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.