సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డాక్టర్ శ్రీకాంత్
వెంకటాపూర్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెంక టాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యా ధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్ అన్నారు. బుధవారం లక్ష్మీదేవి పేట గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 48 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి మందులను అందజేశారు. అనంతరం ఇంటింటి ఫీవర్ సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లా డుతూ వర్షాకాలం సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని అన్నారు. పరిసరా లలో నీరు నిల్వ ఉంటే వాటిపై దోమల ఆవాసాలు ఏర్పాటు చేసుకొని మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాపాయ రోగాలకు దారి తీస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాంతోపాటు వ్యక్తిగత పరిశు భ్రత పాటించాలని అన్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించాలని పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని వైద్య సహాయం పొందా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డాక్టర్ అనిత ఏఎన్ఎంలు స్వర్ణలత, వజ్ర, ఆశా కార్యకర్తలు అలుగోజు సబిత, పొలం రాజ్యలక్ష్మి, బీరెల్లి కవిత, స్వాతి పాల్గొన్నారు.