పదేళ్లలో చేయని టీచర్ల రిక్రూట్ మెంట్ రెండు నెలల్లో పూర్తిచేసినం
– 11,062మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
– రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి సీతక్క
– ఇంచర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన
– ఎన్జీవోల సాయంతో పేదలకు నిత్యావసరాల పంపిణీ
ములుగు ప్రతినిధి : గత పాలకులు పదేళ్లలో చేయని ఉద్యో గ, ఉపాధ్యాయుల నియామకాలను రెండు నెలల్లోనే చేసి చూపించామని, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెల్లలోనే వివిధ శాఖల్లో30,350ల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు బతుకమ్మ పండుగ ముందు రోజు 11,062 టీచర్లకు నియామకపత్రాలు అందించామని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూ య(సీతక్క) అన్నారు. శుక్రవారం ములుగు మండలం ఇంచ ర్ల ఎర్రిగట్టమ్మ ఆలయ సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ భవనానికి కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా ప్రభు త్వం నిర్ణయించిన మొదటి విడత18ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ములుగుకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని పేర్కొన్నా రు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మరో డీఎస్సీ వేసి ఖాళీ లను భర్తీ చేసే ఆలోచనలో ఉందని తెలిపారు. పేదలకు చదు వునిస్తే అద్భుతమైన మానవవనరులగా తయారు చేసుకోవ చ్చన్న ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. గిరిజన బిడ్డలకు ఐటీడీఏ ద్వారా ఉన్నత చదువులకు ఉప యోగకరంగా ఉండేందుకు 43మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించామన్నారు. త్వరలో టాస్క్ సెంటర్ ను ప్రారంభించి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వ నున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీలను సైతం త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలి పారు. ములుగులో ఆధునిక బస్టాండ్ తోపాటు, ఏటూరునా గారంలో బస్ డిపో నిర్మాణం చేపడుతామన్నారు. సుమారు 20ఎకరాల్లో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ములుగు జిల్లాకు ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి జరుగు తోందని, ఉన్నత చదువులకు తగ్గట్లుగా కొలువులను సృష్టిం చే పనుల్లో ఉన్నామన్నారు. గత పాలకులు పదేళ్లలో అన్నీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ భవనాలు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా టీచర్లు లేక అవస్థలు ఎదుర్కొన్నారన్నారు. రైతుల కోసం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి ఇచ్చి న మాట నిలబెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ముందు అర్హత సాధించిన టీచర్లకు నియామకప త్రాలు అందించామని, దసరా పండుగ ముందు రోజున ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేపట్టామని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా పీవో చిత్రా మిశ్రాతో కలిసి లాప్టాప్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సైలు వెంకటేశ్వర్ రావు, రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
– పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన మంత్రి
నిరుపేదలకు ఆసరాగా చేయూత నందించడం అభినందనీ యమని రాష్ర్ట మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ములుగులోని ఎంపీడీవో కార్యాలయం, వెంకటాపూర్, గోవిం దరావుపేట మండలాల్లోని రైతువేదికల్లో షెల్ ఇన్ఫోర్టెక్ సంస్థ సహకారంతో 300లమందికి స్పెషల్ రేషన్ కిట్స్ తోపాటు మంత్రి సొంత నిధులతో 300ల దుప్పట్లను కలెక్టర్ దివాకర టీఎస్, సంస్థ ప్రతినిధులతో కలిసి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పేద లను ఆపద కాలంలో ఆదుకోవడం దైవానికి సేవచేసినట్లేనని వెల్లడించారు. నిత్యం ప్రజలకోసం తపించేవారికి తాను అండ గా నిలబడతానని స్పష్టం చేశారు. పేదవర్గాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో రహీమోద్దీన్, ఈవో పి.రఘు, తదితరులు పాల్గొన్నారు.