ఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : గంగగూడెం, వెంకట్ రాజ్ పల్లి గ్రామాలకు చెందిన 100 మందికి గాను 83 మందికి ముంపు బాధితులకు కన్నాయిగూడెం మండలంలోని ఎంఈ ఓ కార్యాలయంలో ఎస్‌కే ఫౌండేషన్ అధ్యక్షుడు నోబుల్ రాజు, ఎంపీడీఓ అనిత చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ఎంపిడిఒ అనిత మాట్లాడు తూ వరద బాధితులను ఆదుకో వడం గొప్ప విషయమని, ఎస్ కె ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమా లు మరిన్ని చేపట్టాలని కోరారు. వరద బాధి తులకు ఇంకా 17 మందికి అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎంపిఒ సజీధ బేగం, ఎపిఒ కన్నాయిగూడెం కార్యదర్శి స్రవంతి, సీవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.