చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు అభివృద్దికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 571 కోట్ల నిధులు మంజూరు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: భూసేకరణ అభివృ ద్ధి పనుల నిధుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఐ టీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గోదావరి నదిపై గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం హాయంలోనే 571 కోట్ల నిధులు మంజూరయ్యాయని, గత నాలుగు రోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో భూసేకరణ అభివృద్ది పనుల నిధుల కోసం సమీక్ష నిర్వహించినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. చిన్న కాలేశ్వరం అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు విషయంపై ఐ టీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే చిన్న కాలేశ్వ రం పనులకు 571 నిధులు మంజూరయ్యాయని, చిన్న కాలేశ్వరం అభివృద్ధి కోసం భూ సేకరణ కోసం గత రెండు రోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో నిధులు కోసం సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలోగా చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పను లు పూర్తి చేసి 45 వేల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం లో భాగంగానే సమీక్ష నిర్వహించామని అన్నారు. అందు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. కాటారం, మహదేవపూర్, మహ ముత్తారం, మల్హర్ మండలాల్లోని చెరువులను చిన్న కాలే శ్వరం ద్వారా నింపి, రెండు పంటలకు నీళ్లు అందించే కా ర్యక్రమం చేపట్టేందుకు కృషి చేసినట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలియజేశారు.