ఏపీజీవీబీ బ్యాంకింగ్ సేవలపై కళాకారుల ప్రదర్శన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ములుగు జిల్లా నూగూరు వెంకటా పురం బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని నూగూరు గ్రామంలో బ్యాంకింగ్ సేవలపై ఖాతాదారులకు, ప్రజలకు కళాకారుల బృందం అవగాహన కల్పించే ప్రదర్శన లు నిర్వహించారు. వెంకటాపురం ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో వి ఎస్ ఆర్ రూరల్ మీడియా కళాకారుల బృందం ఆధ్వర్యంలో నూగూరు ఆదివాసి గ్రామంలో బ్యాంకు సేవలు, బీమా పథకాలు, రుణాల మంజూరు, రికవరీ, నగదు చెల్లింపు , జమలు , స్వయం సహాయక సంఘాల రుణాలు, డ్వాక్రా గ్రూపుల బాధ్యతలు, బ్యాంకు రుణాలు సేవలు, తది తర అంశాలపై కళాకారుల బృందం గ్రామీణు లకు అర్థమ య్యే రీతిలో ఆట, పాటలతో అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి జీవనజ్యోతి, సురక్ష పథకం, పెన్షన్, పిఎం యోజన, జీవన్ జ్యోతి, ఎస్బిఐ, ఇన్సూరెన్స్ మరియు ఇంకా అనేక బ్యాంకింగ్ సేవలు గురించి కళాకారుల బృందం సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రాంతం కావడంతో ఉదయం పూటనే కళాకారుల బృందం ప్రదర్శన ద్వారా బ్యాం కింగ్ రంగం యొక్క సేవలను కళారూపాల ద్వారా పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ కుమార్, క్లర్క్ రాజు, విఎస్ఆర్ రూరల్ మీడియా కళాకారుల బృందం నుండి, వి. శాంతారాం, వి. శ్రీనివాస్ బ్యాంకు సిబ్బంది, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.