పేదల పెన్నిధి గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సేవా సంస్థ

పేదల పెన్నిధి గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సేవా సంస్థ

పేదల పెన్నిధి గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సేవా సంస్థ

– వెంకటాపురంలో పేద యువతులకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో గ్రామ స్వరాజ్య సంస్థ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యువతులకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి, సద్వినియోగం చేసుకోవాలని గ్రామ స్వరాజ్య సంస్థ నిర్వహకులు కోరారు. సంస్ద ఆధ్వర్యంలో గ్రామీణ పేద యువ తులకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి, శిక్ష ణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు సైతం అందజేయనున్నట్లు సంస్థ ములుగు జిల్లా కోఆర్డినేటర్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ స్వప్న మాట్లాడుతూ శిక్షణలో సమయపాలన, హాజరు, టైలరింగ్ లో మెలుకువలు, ఇంకా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతులకు ఉచిత శిక్షణ తో పాటు 50 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉచితంగా ఇచ్చే టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా సుమారు 35 నుండి 40 మంది మహిళలను ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నారు. ప్రతిరోజు సుమారు 4 గంటల పాటు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment