మూగజీవాలు తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు
– డీసీఎం సహా కారు స్వాధీనం
– 22 మూగజీవాలను గోశాలకు తరలింపు
– ఐదు గురి పై కేసు నమోదు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మూగజీవాలు, ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఏటూరునాగారం ఎస్సై ఎస్కే తాజొద్దీన్ నిందితులను అరెస్టు చేసి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎస్కార్ట్ వాహనంగా కారు, దాని వెనకాల డీసీఎం వ్యాన్ రెండు అతివే గంగా వస్తుండడం గమనించి ఆపి తనిఖీ చేయగా అక్రమంగా మూగ జీవాలను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. 5 గురు వ్యక్తులు మూగజీవాలను తరలిస్తూ పట్టుబడ్డారు. ప్రధాన వ్యక్తి కన్నబోయిన శీను రిపోర్టర్ గా చలామణి అవుతూ ఈ అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నాడన్నారు. అదేవిధంగా వంగ వీటి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన ఆత్కూరి రవీందర్, ఏటూరు నాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామాని కి చెందిన జైస్లావత్ కుమార్, ములుగు మండలం జంగాల పల్లి గ్రామానికి చెందిన కొడాలి కృష్ణ, ఉచిత శ్రీనులు ముందు ఎస్కార్ట్ వాహనంగా ఎపి16సిఏ 3656 నంబరు గల కారులో వెళ్తూ వెనుక టీస్ 12విటి 4046 నంబర్ గల డీసీఎం వాహనంలో 22 మూగజీవాలను అక్రమoగా తరలిస్తు పట్టు బడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి నట్లు ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శబరిష్, సిఐ అనుముల శ్రీనివాస్ ల సూచనల మేరకు మూగజీవాలు, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలపై నిత్యం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో నిత్యం నిఘా పెంచామని, అక్రమ సంపాదనకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.