ఘనంగా పదవీ విరమణ సన్మానం
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని గుర్రెవు ల ప్రైమరి పాటశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యా యులు కూనమల్ల బిక్షపతి శుక్రవారం ఉద్యోగ పదవి విరమ ణ చేస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా విద్య శాఖ అధికారులు మండల అదికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అలరించారు. అదే విధంగా పలువురు మాట్లాడుతూ ఈ నెలలో ఉద్యోగ పదవీ విరమణ చేస్తున్న భిక్షపతి చాలా కాలం పాటు వివిధ పాఠశాలలో పని చేస్తూ విద్యార్థులకు చేసిన సేవల గురించి కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి ఉద్యోగ విరణమ తప్పదని తెలిపారు. వచ్చిన అతిథులు శాలువ పులమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్య శాఖ అధికారి శ్రీనివాస్, జడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాద్యాయుడు పాపయ్య, ప్రైమరి స్కూల్ ప్రధాన ఉపాద్యా యుడు వేణు గోపాల్, ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపా ధ్యాయుడు దయాకర్, అంజయ్య,కొరగట్ల రవీందర్, టీఎస్ యూటిఫ్, పిఇటీ కుమార్ తో ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.