లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఏటూరునాగారం ఏ ఎస్పీ శివమ్ ఉపాధ్యాయ
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏటూరు నాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్, ఓడగూడెం వరద ముప్పు ప్రాంతంను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వాటర్ లెవల్ ప్రమాద హెచ్చరికల సూచనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ 15.950 చేరుకొని మూడవ ప్రమాద హెచ్చరిక కు గోదావరి వరద ఉధృతి ఉదృతంగా క్రమక్రమంగా పెరుగుతుందని అధికారు లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించా లని పోలీస్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉండడంతో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు సలహా లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు