మావోయిస్టు సానుభూతిపరులకు కౌన్సిలింగ్

Written by telangana jyothi

Published on:

మావోయిస్టు సానుభూతిపరులకు కౌన్సిలింగ్

– మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దు. 

– వెంకటాపురం సి.ఐ. బండారి కుమార్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : మావోయి స్టులకు ఎవరు సహకరించవద్దని అలా సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ పాత మావోయిస్టు సానుభూతి పరులకు కౌన్సిలింగ్ కల్పించా రు. శుక్రవారం నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో మండలంలోని వివిధ ప్రాంతాలలో వున్న  పోలీసు రికార్డుల పరంగా నమోదైన పాత మావోయిస్టు సానుభూతిపరులకు  మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా పాత మావోయిస్టు సానుభూతిపరులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు లు గ్రామాల్లోకి వచ్చి మాయమాటలతో, బెదిరింపు చర్యలకు పాల్పడతారని, వారు ఎవరైనా గ్రామాల్లోకి వ్యక్తులు వస్తే ఆశ్రయం కల్ఫించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీ.ఐ. కుమార్ కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కు ప్రతి ఒక్కరు సహకరించాలని, పాత మావోయిస్టు సాను భూతి పరులు గా నమోదైన వారు తమదైన జీవితాల్లో, మార్ఫు తో జీవనంలో ముందుకు కొనసాగాలని ఈ సందర్భంగా పాత మావోయిస్టు సానుభూతి పరులకు హితవు పలికారు. వారి సంక్షేమం కోసం అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని , బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. కౌన్సి లింగ్ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ. బి. కుమార్ , సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment