ఎంపిడిఓకు పంచాయతీ సిబ్బంది వినతి పత్రం అందజేత

Written by telangana jyothi

Published on:

ఎంపిడిఓకు పంచాయతీ సిబ్బంది వినతి పత్రం అందజేత

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వెంకటాపురం మేజర్ పంచాయితి సిబ్బంది ఎంపిడిఓ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది ని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, కారోబర్ , బిల్ కలెక్టర్ల ను సహాయ కార్యదర్శిలుగా నియమించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని, పిఆర్సికీ అర్హులు గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీ.పి. కార్మికులు రంజిత్, తాటి శ్రీను, లకుమళ్ళ సుందర్ రావు, శ్రీనివాస రావు  లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now