జాతీయ రహదారిపై రైజింగ్ కాంట్రాక్టర్ల ఇసుక దందా..!
– డీడీలు ఉన్న డ్రైవర్ల నుంచి అదనపు సొమ్ము వసూళ్లు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : అధికారుల పర్యవేక్ష ణ లేక ఇసుక వ్యాపారుల దందా కొనసాగుతోంది. మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామంలో సొసైటీ ఇసుక ర్యాంపు లకు అనుమతి వచ్చినప్పటికీ లోడింగ్ చేసేందుకుగాను పార్కింగ్ స్థలం లేదు. దీంతో సిరియల్ లోనే ఉంచి రోడ్ పైనే లోడింగ్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదేవిధంగా టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లోడింగ్ క్వారీ గుమాస్తాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ డీడీలు ఉన్నా మామూళ్లు తడపాల్సిందే. లారీ డ్రైవర్ల వద్ద నుంచి ఒక్కొక్క లారీకి లోడింగ్ పేరుతో రూ.5వేల నుంచి 6వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. రైజింగ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ లేకుండా చూసి చూడనట్టు గా వ్యవహరిస్తున్నారు. ఎన్హెచ్ పైనే ఇసుక లోడింగ్ చేస్తుండ టంతో లారీలు ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. దీంతో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినప్పటికి వారు తమకేమీ పట్టదన్నట్టుగా ఇసుకను రోడ్డు మీద లోడింగ్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు అడిగితే ఏం చేస్తారో చేసుకోండంటూ సమాధానం ఇస్తున్నారు. స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రయాణ సౌకర్యం సరిగా లేక చాలా ఇబ్బం ది పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు పట్టించుకొని ప్రయాణికులకు ప్రాణనష్టం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరుతున్నారు.