పంచాయితీ కార్యదర్శుల నిర్లక్ష్య వైఖరిని వెంటనే మార్చుకోవాలి
– బీఎస్పీ వెంకటాపురం మండల అధ్యక్షుడు సొల్లేటి గణేష్ చారి
– సరైన నిబద్ధత సమయపాలన పాటిస్తూ పంచాయతీ అభివృద్ధికై పనిచేయాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పలు పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక అధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు పంచాయితీల్లో కార్యదర్శుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిఎస్పి మండల అధ్యక్షుడు గణేష్ చారి మాట్లాడుతూ పంచాయతీల లోని కార్యదర్శులు తమ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు తమ విధులకు సక్రమంగా ఎందుకు హాజరవు కావడం లేదని ఆయన ప్రశ్నించారు? వారి విధులలో సరైన నిబద్ధత, సమయపాలన లేదని, గ్రామాలలో అనేక సమస్యలు ఉన్న పంచాయతీ కార్యదర్శులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీలలో పలు చోట్ల సరైన పారిశుద్ధ్య లోపాలు కనిపిస్తున్నాయని, మురికి నీరు నిల్వలు ఉంటున్నాయని, సరైన డ్రైనేజీ కాలువలు తవ్వించే బాధ్యత పంచాయతీకి ఉందని బిఎస్పీ నేత గణేష్ చారి ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాల సౌకర్యం అన్ని చోట్ల లేదని, దానికి సంబంధించిన మరమ్మత్తులు వెంటనే చేయించాలన్నా రు. సమయానికి మంచినీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతు న్నారన్నారు. వేసవిలో సకాలంలో ప్రజలకు నీరు అందించాలని, అలాగే మిషన్ భగీరథ మంచినీటిని అందించడంలో పరిశుభ్ర తలు పాటించాలని ఆయన చెప్పారు. ఫేక్ జిపిఎస్ యాప్ తో విధులకు హాజరు కాకుండా పంచాయతీలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా విధులకు గైర్హాజరు అయితే అటువంటి వారిపై అవసరమైతే కలెక్టర్ కి కంప్లైంట్ పెడతామని ఆయన హెచ్చరించారు. పంచాయతీల అభివృద్ధికై ప్రతినెల ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయం ఏ పనులకు గాను ఖర్చు చేస్తున్నారో, ప్రతినెల గ్రామసభలు నిర్వహించి ప్రజలకు వివరించాలని, అది పంచాయతీ కార్యద ర్శుల బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే గ్రామ సభలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇకనైనా పంచా యతీ కార్యదర్శులు తమ తప్పుడు ధోరణి మార్చుకొని సమయానికి వీధులు నిర్వహిస్తూ గ్రామాలలో ఉన్న ప్రజల ఇబ్బందులు, సమస్యలు పరిష్కరిస్తూ తమ విధులకు న్యాయం చేయాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు గణేష్ చారి కోరారు.