ఘనంగా పోషణ పక్వాడ వారోత్సవాలు
కాటారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని ధన్వాడ గ్రామం లో గల అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వాడా పక్షోక్షవాలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల బరువులు చూసి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకో వాల్సిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు.మంచి పౌష్టికాహా రం తీసుకోవడం వల్ల చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.ఆరోగ్యమే మహా భాగ్యమని వివరించారు.ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకో వాలో అవగాహన కల్పించారు.అలాగే చేతులు శుభ్రం చేసుకోవ డంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కారెంగుల శ్రీలత, తిత్తుల రజిత,ఏఎన్ఎం,ఆశా రజిత, లబ్దిదారులు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.