వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
మేడారం, జనవరి 20 (తెలంగాణ జ్యోతి):వనదేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే ములుగు జిల్లా మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క–సారలమ్మ వన దేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈవో, పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.







