డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్ ను ప్రారంభించిన మంత్రి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ రేంజ్ డిప్యూటీ రేంజ్ క్వార్టర్స్ ను మంత్రి దనసరి సీతక్క, సిసిఎఫ్ ప్రభాకర్ రావు, కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జిడిఎఫ్ రాహుల్ కిషన్, గ్రంథాలయ చైర్మన్ రవిచంద్ర లతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మంత్రి సీతక్క మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, ఎఫ్ డి ఓ రమేష్, డిఎస్పి రవీందర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.