పాఠశాలతోనే విద్యార్థుల భవిష్యత్తు
– పేద విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషి చేయాలి
– మండల విద్యాశాఖ అధికారి తాళ్ల ప్రభాకర్
వెంకటాపూర్ తెలంగాణ జ్యోతి : పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని వెంకటాపూర్ మండల విద్యాశాఖ అధికారి తాళ్ల ప్రభాకర్ అన్నారు. వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట మండల పరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూత్రాల రవి అధ్యక్షతన సీనియర్ ఉపాధ్యాయులు పెండ్యాల సలేంద్రం పర్యవేక్షణలో నల్లవెల్లి సాంబయ్య విద్యార్థులకు విలువైన స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి తాళ్ల ప్రభాకర్ గ్రామ మాజీ సర్పంచ్ గట్టు కుమారస్వామి,కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ అహ్మద్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కారుపోతుల యాదగిరి తో పాటు పలువురు గ్రామ పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్ర మంలో నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బరులు, పలకలు సీనియర్ జర్నలిస్ట్ నల్లబెల్లి సాంబయ్య అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి తాళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యా ర్థుల అభ్యున్నతికి పాటుపడాలని వారి భవిష్యత్తును ఉత్తమం గా తీర్చే దిశలో కృషి చేయాలని అన్నారు. మా పాఠశాల విద్యార్థులకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతగానో ఉపయో గపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్టడీ మెటీరి యల్ అందించిన సీనియర్ జర్నలిస్ట్ నల్లబెల్లి సాంబయ్య, మండల విద్యాశాఖ అధికారి తాళ్ల ప్రభాకర్ లను శాలువలతో పాఠశాల సిబ్బంది సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుండె యాదగిరి పోలోజు రాజమౌళి, ఉపాధ్యాయులు సాంబ య్య సోనాలిక శ్రీ, అంగన్వాడీ ఆయా స్వరూప, స్కావెంజర్ లక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.