Gruhalaxmi | ఏజెన్సీలో గృహలక్ష్మి పై హై కోర్టు స్టే విధించడం అన్యాయం

Gruhalaxmi | ఏజెన్సీలో గృహలక్ష్మి పై హై కోర్టు స్టే విధించడం అన్యాయం : జాడి ఈశ్వర్ నేతకాని

 ములుగు ప్రతినిధి : ఏజెన్సీ లో గిరిజనేతరులకు గృహలక్ష్మి వర్తించదని హై కోర్టు స్టే విధించడం ముమ్మాటికీ అన్యాయమే అని తెలంగాణ నేతకాని హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్ నేతకాని అన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతం లో ఏజెన్సీ చట్టాలు రాక ముందు నుండే అన్ని కులాల వాళ్ళు నివసిస్తున్నారని, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒక్క వర్గానికి చట్టాలు తెచ్చి, రాజ్యాంగం లో మార్పులు చేర్పులు చేసి అమలు చేయడం మంచిదే అయినప్పటికి మిగతా వర్గాల పేద ప్రజలను నట్టెట్లో ముంచిన రాజకీయ పార్టీలకు గిరిజనేతరుల పేద ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చట్టాలు వచ్చి 50 సంవత్సరాలు దాటిన ఇంకా ఆ చట్టాలను అలానే ఉంచి, గిరిజనేతరుల పేదల కోసం కనీసం కూడా ఆలోచించకుండా ఉంటున్న రాజకీయ పార్టీలకు మీ ఓటు తో, ఉద్యమాలతో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలానే చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు మనుగడ దెబ్బతినే అవకాశం లేక పోలేదని ఇకనైనా గిరిజనేతరులందరూ మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ లో ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీల అభ్యర్థులను ప్రతి గిరిజనేతర బిడ్డ వాళ్ళను మన హక్కుల కోసం నిలదీయాలని, మనకు సరైన సమాధానం ఇవ్వకుంటే ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హైకోర్టు కు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు వేలాది లెటర్స్ మనకు హక్కులు కల్పించాలని పంపాలని పిలుపునిచ్చారు. మా ఓట్లు మీకు కావాలి, మాకు పూర్తి స్థాయి రాజ్యాంగ హక్కులు మాత్రం కల్పించరా, చట్ట సవరణ జరిగే వరకు ఏజెన్సీ లో ఎన్నికలు పూర్తిగా ఆపాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ పంపనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ గిరిజనేతరుల తరుపున నవంబర్ 1 తేదీన ములుగు జిల్లా కేంద్రం లో తెలంగాణ నేతకాని హక్కుల పోరాట సంఘం అధ్వర్యంలో లో సమావేశం ఏర్పాటు చేసి, ఏజెన్సీ లో హక్కులు కల్పించాలని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసి, ఆ కాఫీ ని జిల్లా కలెక్టర్ మరియు ప్రతి రాజకీయ పార్టీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కావున అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment