బిజెపి జిల్లా అధ్యక్షుడివి ఒంటెద్దు పోకడలు.
– మాజీ మండల అధ్యక్షుడు రాకేష్
ములుగు : భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుండి ఒంటెద్దు పోకడలతో పార్టీనీ బ్రష్టు పట్టిస్తున్నాడని మాజీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పార్టీ కోసం ఏనాడు పనిచేయకుండా పార్టీ పేరు చెప్పి సొంత పనులు చేసుకున్న వారికి పట్టం కడుతూ, పదవులు ఇస్తూ పార్టీ ఆదేశాలను దిక్కరిస్తూ ఇస్టారీతిన వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పార్టీ ఉన్నది కోసం కష్టపడే వారికి కాకుండా తన అనుచరులకు పార్టీ పదవులు కట్టపెట్టి నేను చెప్పిందే నడవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో జిల్లాలో పార్టీ కార్యక్రమాలు అనేకం విజయవంతంగా చేశామని, జిల్లా అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన తరువాత మొదటి కార్యక్రమం ప్రజా సంకల్ప యాత్రను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలమయ్యాడన్నారు. కార్యక్రమం నిర్వహించడం చేతకాని వారు ఇతరులపై అక్కకు వెళ్ళబోసుకోవడం సబబు కాదని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమం కోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తే కనీసం జిల్లా కేంద్రంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పెట్టకుండా, కార్యక్రమానికి ప్రజలు లేకుండా, సీనియర్ నాయకులకు సమాచారం లేకుండా కార్యక్రమం విఫలం చేసారని అన్నారు. ములుగు జిల్లాలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి తప్ప సొంత ఏజెండాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మాజీ మండల అధ్యక్షుడు రాకేష్ యాదవ్ అన్నారు.