దేశం కోసం మరోసారి మోదీ..
– గిరిజనులకు పెద్దపీట వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..
– రాష్ర్టపతిగా గిరిజనబిడ్డ, సమ్మక్క సారలమ్మల పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసినం
– సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
– ములుగులో విజయసంకల్ప యాత్ర
ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : దేశం కోసం మరోసారి మోదీ సర్కారు రావాలని, ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచి కావాలంటే ప్రధానిగా మోదీ రావాలని బీజేపీ నేత, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. భారతదేశంలో అట్టడుగు వర్గాలకు అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ర్టపతి గా గిరిజనబిడ్డకు ప్రాధాన్యతనివ్వడం గర్వకారణమని, పేద గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలంటే మరోసారి కేంద్రంలో మోదీ సర్కారు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర గురువారం ములుగు మండలం మల్లంపల్లి నుంచి ప్రారంభ మై గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్న నేతలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ములుగులో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, యాత్ర ఇన్చార్జి మార్తినేని ధర్మారావులతో కలిసి ఎమ్మెల్యే హరీష్బాబు పాల్గొన్నారు. అనంతరం వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామ లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ములుగులో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ…. వనదేవతలు సమ్మక్క, సారలమ్మల పేరుతో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి రూ.900ల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, వెయ్యి మంది గిరిజన బిడ్డలు ఉన్నత విద్య చదివే అవకాశం ఉందన్నారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంకు పార్లమెంటు ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. భారత్ ను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలిపే బలమైన నాయకుడు ప్రధాని మోదీ మాత్రమేనని, అలాంటి నేతను మళ్లీ మూడోసారి నిలబెట్టుకొని బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దేశం అదోఘతి పాలవుతుందని, కాంగ్రెస్ సర్వేలు కూడా బీజేపీకి 400ల సీట్లు వస్తున్నట్లు తేల్చాయని అన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశాల నుంచి ఫోన్ రాగానే యాత్ర వదిలి వెళ్లిపోయారని, అలాంటి వ్యక్తి మనుక కావాలో ఇక్కడి ప్రజల కోసం అహర్నిషల్ కష్టపడే వ్యక్తిని ఎన్నుకుంటారో మీ చేతుల్లో ఉందన్నారు. కాశ్మీర్ ను ఆర్టికల్ 370రద్దు చేసి భారత్ అంటే ఇది అని నిరూపిం చారన్నారు. 500ల ఏళ్లుగా సాధ్యంకాని అయోధ్యలో బాల రాముని నిర్మాణం పూర్తయిందని, పార్లమెంటులో మహిళలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీదేనని స్పష్టం చేశారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వం కేంద్రంలో కావాలని, సమర్థతతకు, అసమర్థ తకు మధ్య జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలుగా భావించి మహబూబా బాద్ పార్లమెంటు స్థానాన్ని ఓటు హక్కుతో బీజేపీకి కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన, గిరిజనేతర, పేద బిడ్డలందరూ ప్రధాని నరేంద్రమోదీ కోసం కష్టపడి మరోసారి ప్రధానిగా నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలు కేంద్రంలో నరేంద్రమోదీని నిలబెట్టుకునేందుకు ఉత్సాహపడు తున్నార న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కూడా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకోసం పనిచేయాలని కోరారు. విజయ సంకల్ప యాత్ర ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోట్లాది రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టారని, వెంకటాపూర్ లోని రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయా నికి యునెస్కో గుర్తింపుకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. ప్రపంచానికి భారత్ దిక్సూచిగా మారాలంటే మరోసారి మోదీ సర్కారు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్, మహబూ బాబాద్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునేలా గిరిజన బిడ్డలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది గిరిజనులకు నిధులు కేటాయించి కేంద్రం ద్వారా లబ్ధి చేకూర్చారన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ సంకల్ప్ యాత్ర సహ ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, అసెంబ్లీ ఇన్చార్జి పి.నరోత్తంరెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణ వేణి నాయక్, రాష్ట్ర నాయకులు అజ్మీర ప్రహ్లాద్, బీజేపీ ఎస్టీమోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, అల్లె శోభన్, భూక్య జవహర్ లాల్, గాదం కుమార్, జినుకల కృష్ణాకర్ రావు, చల్లూరి మహేందర్, పైడాకుల మల్లేష్, మద్దినేని తేజరాజు యాదవ్, మల్లెల రాంబాబు, గాడి శేఖర్, జాడి వెంకట్, ఇమ్మడి రాకేష్ యాదవ్, శేఖర్, సత్యం, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.