కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 

Written by telangana jyothi

Published on:

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 

– పంటలు ఎండిపోతున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

– రూ.500ల బోనస్, రైతు రుణమాఫీ చేపట్టాలి

– కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో చుక్క నీళ్లు కూడా ఇవ్వలే

– మాజీ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ 

– ములుగులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో రైతు సత్యాగ్రహ దీక్ష

ములుగు, తెలంగాణ జ్యోతి : గత బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, పంటలు ఎండిపోతున్న పట్టించుకోవడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. పంటలకు రూ.500ల బోనస్ వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. రాష్ర్ట శాఖ పిలుపుమేరకు శుక్రవారం ములుగు లోని బీజే పీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వ హించిన రైతు సత్యాగ్రహ దీక్షకు సీతారాం నాయక్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రూ.500 బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. అదేవిధంగా ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ ఇస్తామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మూడు నెలల కాలం దాటినా ఆ హామీలను పట్టించు కోవడంలేదన్నారు. విద్యుత్ కోతలు వస్తున్నాయని, రైతులు నష్ట పోతారన్నారు. రైతు కూలీలకు రూ.12ఏవల చొప్పున అందజేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎరువుల ధరలు తగ్గించారని, రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చారని, మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల పేర జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాళిక తరగతులను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాంతీయ పార్టీలతో ఒరిగేదేమీలేదన్నారు. ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై అపారమైన నమ్మకం ఏర్పడిందని, ఈసారి మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు యువత కంకణం కట్టుకున్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తు న్నానని, ఈసారి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్క్షాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక వేత్త అయిన జగ్జీవన్ రాం ను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు నడవాలన్నారు. దేశం ముందుకు సాగాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల నరేంద్ర బాబు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి నరోత్తం రెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, మండల అధ్యక్షుడు గాదం కుమార్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు లోడె శ్రీనివాస్, నాయకులు రవీంద్రాచారి, రవిరెడ్డి, కారుపోతుల యాదగిరిగౌడ్, చల్లూరి మహేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now