ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాలలో సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ ఒక ప్రకటన లో తెలిపారు. 3449 విద్యార్థులకు 3442 మంది విద్యార్థులు హాజరు కాగా,7గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగయ్యపల్లి, చెల్పూర్, ఆదర్శ పాఠశాల గణపురం, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి.