Telangana | తెలంగాణలో రూ.300 లకే ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్
– లాంఛనంగా రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో పతి పల్లెకు రూ. 300 లకే ఇంటర్నెట్ కనెక్షన్, కేబుల్ టీవీ, ఈ – ఎడ్యుకేషన్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా మొదట నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఇంటింటికి ఇంటర్ నెట్ కనెక్షన్ పథకాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా, కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ఈ ప్రారంభించింది. అయితే, ఫైబర్ నెట్ కనెక్షన్ బాధ్యతను టీ ఫైబర్ సంస్థ దక్కించుకుంది. ఇంటింటికీ ఇంటర్ నెట్ కనెక్షన్ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లను బడ్జెట్ కేటాయించింది. పథకంలో భాగంగా 20 ఎంబీపీఎస్ స్పీడ్ తో సర్కార్ ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను అందజేయనుంది. అదే విధంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశా లలకు అంగన్వాడీ లకు ఉచితంగా కనెక్షన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని నేరాల కట్ట డికి గ్రామాల్లోని సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నారు.