కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని నేడు కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. లక్షలాది జీవితాల్లో అర్ధవంతమైన మార్పును తీసుకొచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి దేశ ప్రజలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.