డిప్యూటేషన్ ద్వారా ఉపాద్యాయులను నియమించాలి
– మాజీ వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ ల కేంద్రంలోని మాజీ ఎంపీపీ బొల్లె భాస్కర్ గురువారం విలేక రుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో జడ్పీహెచ్‌ఎస్ గుర్రేవుల పాఠశాలలో ఆంగ్లం, హిందీ ఉపాధ్యాయులు లేక పోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుర్రేవుల పాఠశాలకు వెంటనే డిప్యూటేషన్ ద్వారా ఉపాద్యా యులను నియమించాలని, వెంటనే ఇంగ్లీషు,హిందీ ఉపాధ్యా యులను గుర్రేవుల పాఠశాల డిప్యూటేషన్ ద్వారా పంపాల న్నారు. కలెక్టర్, డీఈఓ స్పందించి టీచర్లను త్వరితగతిన నియమించాలని కోరారు.