పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తా
– వెంకటాపురం మండల నూతన విద్యాధికారి సత్యనారాయణ.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని 47 పాఠశాలల్లో, ఇతర విద్యాసంస్థలలో విద్యా ప్రమాణాలు పెంపొందించేం దుకు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీల సహకారంతో కృషి చేస్తానని మండల విద్యాధికారిజీ .వీ.వి. సత్యనారాయణ అన్నారు. మండలంలో గత 13 సంవత్సరాలుగా రెగ్యులర్ మండల విద్యాధికారి లేకపోవడంతో ఇంత కాలం ఇన్చార్జి లతో నెట్టుకొచ్చారు. కాగ వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న జీవీవీ సత్యనారాయణకు, మండల విద్యాధికారిగా అదనపు బాధ్య తలు అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేయగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నూతన ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలోని 47 మండల పరిషత్ పాఠశాలలతో పాటు, ఇతర విద్యా సంస్థల పాఠశాలలో మొత్తం 3,600 మంది విద్యార్థులు ఉన్నారన్నా రు. ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు, ఉపా ధ్యాయుల సమయపాలన, హాజరుశాతం, విద్యార్థులయొక్క పఠనా శక్తి ఇతర విద్యా అంశాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు సహకారంతో ముఖ్యంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బృందాలతో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తానన్నారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుతో పాటు, పౌష్టికాహారం విద్యార్థులకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఎంఈఓ సత్యనా రాయణ తెలిపారు. పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన ఎంఈఓ కు మండల విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం తమ పాఠశాల హెడ్మాస్టర్ ఎంఈఓ గా పదవి బాధ్యతలు స్వీకరించి నందుకు అభినందనలు తెలుపుతూ సత్కరించారు.