గిరిజన బాలుర వసతి గృహంలో తాసిల్దార్ పల్లెనిద్ర
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : వెంకటాపు రం మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని తహసిల్దార్ లక్ష్మీరాజయ్య మంగళవారం సాయంత్రం సంద ర్శించి విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలిం చారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వెంకటాపురం మండలం లో మండల అధికారులు ఆయా ప్రభుత్వ వసతి గృహాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు వండి వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందుతు న్న సౌకర్యాలను, సేవలను విధ్యార్ధులను అడిగి తెలుసుకుని లోటుపాట్లను నమోదు చేసుకొన్నారు. విద్యార్థులకు మెనూ చార్ట్ ప్రకారం అందించే సేవలతో పాటు, పరిసరాల పరి శుభ్రత, వసతి నియమ నిబంధనల అమలుతీరును, అధికా రుల బృందం పల్లే నిద్రలో క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి వసతి గృహంలో అధికారులు నిద్రిం చారు. వసతి గృహాల పల్లెనిద్ర కార్యక్రమంలో వెంకటాపురం డిప్యూటీ తాసిల్దార్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, వసతి గృహం సంక్షేమ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.