ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ ప్రోగ్రామ్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : టీజీ డబ్ల్యూ ఆర్ డి సి గర్ల్స్ ములుగు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ క్యాంపెయిన్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 2024లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటరీస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక కె కార్యక్ర మాల అన్నిటి గురించి వివరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న చారిత్రాత్మకమైన ప్రదేశాలను శుభ్రపరిచి, సెప్టెంబర్ 18 నుండి 19 వరకు గ్రామాలలో లోకల్ కాలనీ లో కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ క్లీన్ అండ్ గ్రీన్ చేసి, సెప్టెంబర్ 20న విద్యార్థులతో ర్యాలీ తీస్, 21న స్వతం త్ర సమరయో ధులను కలిశారు. విలేజ్లో ఉన్న పెద్దలతో ఉన్న సౌకర్యాలు, కావలసిన వాటి గురించి విద్యార్థులు చర్చించారు.అదేవిధంగా ఏరియా హాస్పిటల్ ఏటూరు నాగారం లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల తో మాట్లాడారు. సెప్టెంబర్ 26 న మార్కెట్ లోకల్ ఏరియాలో శుభ్రత,పరిశుభ్రత గురించి వివరించారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో అవేర్నెస్ ప్రోగ్రాం శుభ్రత పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. చదువు యొక్క ప్రాముఖ్యతను, అమర వీరుల ప్రాముఖ్యత గురించి వాళ్ళు చేసిన త్యాగాల గురించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఎన్ఎ స్ఎస్ వాలంటీర్స్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ మెంబర్స్ మంజుల సవిత, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పాల్గొన్నారు.