మృతుని కుటుంబానికి సహాయం
– నిత్యవసర వస్తువులు పంపిణీ.
వెంకటాపురంనూగూరు,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం శివారు బీ.సీ మర్రి గూడెం గ్రామానికి చెందిన గగ్గురి శ్రీను ఇటివల అనారోగ్యం తో మరణించా రు. వారి పేద కుటుంబం పరిస్థితి ఆర్ధికం గా ఇబ్బందులు పడుతుండటంతో పెద్దకర్మ నిమిత్తం బీ.సీ. మరిగూడెం గ్రామానికి చెందిన కొంతమంది యువత గగ్గూరి శ్రీను కుటుంబానికి నిత్యవసర సరుకుల తో పాటు ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటారు.ఈకార్యక్రమం లో గంగయ్య, పానేం వెంకట్, బొల్లె శీను, కొప్పుల వినోద్ ,బట్టి నరేష్, వాదం జోగారావు, యాట్ల వెంకటేష్, గగ్గూరి సతీష్,బొల్లె సందీప్, అంగాల ప్రవీణ్, రోడ్డ నరసింహారా వు, బొల్లె రామకృష్ణ, కొప్పుల కిరణ్ బొల్లే ఆదినారాయణ తదితరులు పాల్గొని కుటుంబాన్ని ఓదార్చి అండదండగా ఉంటామని ధైర్యం చెప్పి ఓదార్చారు.