దేశవ్యాప్త కార్మిక సమ్మెకు మద్దతు
ములుగు, తెలంగాణ జ్యోతి: దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మిక సమ్మెలో భాగంగా ములుగు ఏరియా హాస్పిటల్ కార్మిక సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతుగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ తరపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గాదె రమేష్, యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫజల్ లు మాట్లాడుతూ వైద్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సరైన వేళలో కట్టాలని, నెల నెల జీతాలు ఇవ్వాలని, కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని వైద్య విభాగం అన్ని విభాగాల కంటే ముందు వరుసలో ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారే గాని వేతనాలు ఇవ్వడంలో విఫలమవు తున్నారని బేషరతుగా వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాలుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఫజల్, యూనియన్ జిల్లా నాయకులు ఈక మమత, భాస్కర్, సురేష్, వేణు నాయక్, అజిత, ఏం భాస్కర్, రాజు, మహాలక్ష్మి, సంధ్య, రమేష్, కృష్ణ, విజయ్ చందర్, తదితర వైద్య సిబ్బంది శానిటేషన్, ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.