అయోధ్యకు తరలిన రామభక్తులు..
– ములుగులో శోభాయాత్ర
ములుగు, తెలంగాణ జ్యోతి : అయోధ్యలోని బాల రాముని సన్నిధికి ములుగు జిల్లా నుంచి రామ భక్తులు తరలివెళ్లారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ (శ్రీ క్షేత్రం) అధ్యక్షుడు గండ్రకోట కుమార్, బిజెపి కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు జినుకాల కృష్ణాకర్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 120మంది రామ భక్తులు అయోధ్యకు బయలు దేరారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి తిరుమల థియేటర్ వరకు జాతీయ రహదారిపై కాషాయ జెండాలు పట్టుకొని డీజే శబ్దాల మధ్య శోభాయాత్ర నిర్వహించి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. 500 ఏళ్ల రామభక్తుల పోరాటానికి అయోధ్యలో బాల రాముని ప్రతిష్ఠతో హిందువుల చిరకాల వాంఛ నెరవేరిందని నందకోట కుమార్ జినుకుల కృష్ణాకర్ రావు అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, తమ పిల్లలకు తల్లిదండ్రులు రామాయణ మహాభారతాలను తెలపాలని కోరారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప కార్యం అయోధ్యలో రాములవారి గుడి నిర్మాణంతో పూర్తయిందని అన్నారు. రామ మందిరం కోసం కరసేవలో పాల్గొన్న భక్తులు కూడా అయోధ్యకు తరలి వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామభక్తులు దొంతి రెడ్డి రవి రెడ్డి, గాజుల కృష్ణ, ఎల్కతుర్తి శ్రీహరి, సుతారి సతీష్, సిరికొండ బలరాం, అల్లె శోభన్, గుగులోతు స్వరూప, గాదం కుమార్, గంగిశెట్టి రాజ్ కుమార్, సూర్యదేవర విశ్వనాథ్, బైకాని సాగర్, ఇమ్మడి రమేష్, రాయించు నాగరాజు, శ్రీనివాస్, దేవేందర్, సతీష్, ఒజ్జల లింగన్న, గట్టుమల్లు, ఓదెల రమేష్, వెంకటేష్, తది తరులు పాల్గొన్నారు.