విద్యార్థులు దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలి
– సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెంట్ ఆర్కే పాండే
– జంగాలపల్లిలో తిరంగా ర్యాలీ
ములుగు ప్రతినిధి : యువత దేశభక్తి భావాలు పెంపొందిం చుకోవాలని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధను లను స్మరించుకోవాలని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కమాం డెంట్ ఆర్కే పాండే పిలుపునిచ్చారు. బుధవారం ములుగు మండలం ఇంచర్ల క్యాంపు నుంచి జంగాలపలపల్లి, ఇంచర్ల గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిం చారు. జాతీయజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడు తూ భారతదేశ గౌరవాన్ని కాపాడాలని, చిన్నారులు ఉన్నత చదువులతో మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో 2వ కమాండెంట్ రాజేష్ తివారీ, డిప్యూటీ కమాండెడ్ రజిత, ఇన్స్పెక్టర్లు హనుమంతరావు, ఎమ్ఎమ్ రాజు, సబ్ ఇన్స్పె క్టర్లు టీపి రెడ్డి, ఆండ్రోస్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.