ములుగులో 8కిలోల గంజాయి పట్టివేత
– బస్టాండ్ ఆవరణలో స్వాధీనం
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో 8కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ములుగుకు గంజాయి సరఫరా అవుతోందనే పక్కా సమాచారం మేరకు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరనలో సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వమించామని, ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో విచారించగా వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. 8కిలోల ఎండు గంజాయి విలువ రూ.1.92లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న ఆంధ్రపర్దేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా చింతూరు మండలం బురఖాన కోటకు చెందిన ముర్రె రామకృష్ణ, ప్రకాశం జిల్లా చింతలపాడు గ్రామానికి చెందిన బూదాల మురళిలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వర్ రావు వివరించారు. కాగా, గంజాయి సేవించినా, రవాణా చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అయితే 8కిలోల గంజాయి పట్టుకున్న వార్తతో ములుగులో కలకలం రేగింది. ములుగు ప్రాంతంలో యువత గంజాయి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సర్వత్రా కోరుతున్నారు.