వాజేడులో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారి ర్యాలీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినో త్సవం పురస్కరించుకొని మంగళవారం గ్రామం లోని పరిషత్ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాలల విద్యార్థులు వంద అడుగుల పొడవున్న జాతీయజెండాతో భారీ ర్యాలీ నిర్వహిం చారు.ఈ సందర్భంగా జరిగిన ర్యాలీకి ప్రభుత్వ శాఖల ఉద్యో గులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సైతం భారత రాజ్యాంగ దినోత్సవం భారీ ర్యాలీలో పాల్గొన్నారు. వాజేడు మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో వందల సంఖ్యలో విద్యార్థులు జాతీయ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లడంతో, పలువు రు భారత్ మాతాకీ జై, స్వతంత్ర భారత్ కి జై అంటూ దేశభక్తి నినాదాలు చేశారు.వంద అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం పట్ల ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందా లను, విద్యార్థులను పలువురు ప్రశంసించారు.