రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
– వెంకటాపూర్ ఎంపీడీవో మూడు రాజు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వెంకటాపూర్ ఎంపీడీవో మూడు రాజు అన్నారు. మంగళవారం వెంకటాపూర్ మండలంలోని వెంకటాపూర్, నల్లగుంట, లక్ష్మీదేవిపేట, అడవి రంగాపూర్, నర్సాపూర్ గ్రామాలలో రైతుల పశువుల పాకలు, అజోల కల్టివేషన్స్, నడిప్ కంపోస్టు పిట్స్, నర్సరీలు, పండ్ల తోటలు, ఇంకుడు గుంతలు ముగ్గు పోసి ప్రారంభించారు. అనంతరం ఉపాధి పనులు చేసిన కూలీలకు శాలువాలు కప్పి అభినం దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి పనులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నారగోని సునీత, ఈ సి జనగాం సురేష్, పంచాయతీ కార్యదర్శులు దామోదర్, దుర్గాప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ కుమార్, సురేష్ , ఫీల్డ్ అసి స్టెంట్లు పోలోజు రామాచారి, కేతిరి రాధిక నల్లబెల్లి భాస్కర్ తదితర ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు రైతులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు .