పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

Written by telangana jyothi

Published on:

పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

– నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు

– ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి భాదితులకు న్యాయం చేకూర్చాలి

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే 

భూపాలపల్లి ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : పార్లమెంట్     ఎన్నికల్లో  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా పోలిసు కార్యాల యంలో జిల్లా పరిధిలోని డీఎస్పీలు, సిఐ లు, ఎస్సై లతో ఎస్పి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంత గ్రామాల్లోని ప్రజలు నిర్భయంగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని, ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పేర్కొన్నారు. అలాగే లాంగ్ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఎస్పి తెలిపారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి, భాదితులకు న్యాయం చేకూర్చాలని, గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు. జూదం, బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆయా వ్యక్తులపై చట్ట ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు.సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రౌడీషీటర్లు మరియు పాత నేరస్తుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పి అన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం, వర్టికల్, సైబర్ క్రైమ్ డిఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now