శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న రామగుండం సిపి
మహదేవ్ పూర్, తెలంగాణ జ్యోతి : శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని రామగుండం సీ పీ శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చక స్వాములు రాజగోపురం నుండి మర్యాద పూర్వక స్వాగతం పలికి స్వామి వారికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామి వారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.