భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి.
– అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క.
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను రాష్ట్ర మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు గట్టమ్మ తల్లినీ దర్శించుకుంటారు. భక్తులకు మంచి నీటి సమస్య మరుగు దొడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ శభారిష్,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ, ఆర్డీవో సత్యాపాల్ రెడ్డి, డిఎస్పీ రవీందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.