అంగరంగ వైభవంగా శ్రీ బీరమయ్య జాతర

అంగరంగ వైభవంగా శ్రీ బీరమయ్య జాతర

– తరలివచ్చిన మూడు రాష్ట్రాల భక్తులు

– వేలాది మంది భక్తులతో కిక్కిరిసిన అభయారణ్యం

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం లొటపిట గండి అభయారణ్యంలో వేంచేసి ఉన్న శ్రీ భీరమయ్య జాతరకు వేలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మ డి వరంగల్ జిల్లాలతో పాటు సరిహద్దులోని చత్తీస్గడ్, మధ్య ప్రదేశ్, మహా రాష్ట్ర ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో లొటపిట గండి జనసంద్రమైంది. శనివారం రాత్రి తెల్ల వార్లు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం డోలి సన్నాయిలతో గిరిజన సంస్ర్కుతి సంప్రదాయంతో దేవర్ల పూనకా లతో తెల్లవార్లు జాతర మహోత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. జాతీయ రహదారి 163 టేకులగూడెం పంచాయతీ లొటపిట గండి జాతీయ రహదారి కి ఇరు వైపుల వందలాది దుకాణాలు జాతరకు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారికి గంగా స్నానంతో బీరమయ్య జాతర ముగుస్తుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు యాలం అచ్చయ్య, టేకుల గూడెం సర్పంచ్ వాసం కృష్ణవేణి, టేకులగూడెం యూత్, యువకుల బ్రుందం, భక్తులు మరియు టేకులగూడెం పిసా కమిటీ ఉపాధ్యక్షులు బాహుబలి శ్రీనివాసరావు లతో పాటు పలువురు జాతరను విజయ వంతం చేయటానికి రేయింబవళ్లు కృషి చేశారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యంతో పాటు, స్వామివారి దర్శనానికి కొండల పైకి వెళ్లే దారులను  బాగు చేశారు. గోదావరి నది తీరం వద్ద జాతర మహోత్సవం జరుగుతుండగా స్నానాలు చేసే భక్తుల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అభయారజ్యంలో వంటలుచేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదాలను స్వీకరించారు. బంధుమిత్రులు దూర ప్రాంతాల నుండి వందలు, వేల సంఖ్యలో శ్రీ భీరమయ్య జాతరకు తరలి రావడంతో అభయారణ్యం జన సంద్రంగా మారింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment