రెండు ఇసుక లారీలు ఢీ – డ్రైవర్లకు తీవ్ర గాయాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు ఇసుక లారీలు ఢీకొన్నాయి. సేకరించిన వివరాల ప్రకారం….చర్ల నుండి వెంకటాపురం వైపు వస్తున్న ఇసుక లారీ, ఇటువైపు నుండి చర్ల కు వెళుతున్న మరో లారీ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్లో డ్రైవర్ భాస్కర్ ఇరుక్కుపోగా ప్రజలు తాళ్ల సహాయంతో డ్రైవర్ను వెలికి తీశారు. అలాగే మరో లారీ డ్రైవర్ సతీష్ కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాఇ. 108 అంబులెన్స్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.