అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
తెలంగాణా జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తలం బ్రాలు మేళ తాళాలతో తీసుకొచ్చారు. వేదమంత్రాల మధ్య మహం కాల్య ధారణ కార్యక్రమాన్ని 12 గంటల ఐదు నిమిషాలకు వేద పండితులు ముక్కామల వెంకట్ నారాయణ శర్మ మణికంఠ శర్మ నాగేశ్వరరావు శర్మలు కళ్యాణ్ జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదంతో నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. స్థానిక ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ దంపతులు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలకు చిన్నారులు అలరించారు. ఆంజనేయ స్వాములు రామాలయం కమిటీ తదితరులు పాల్గొన్నారు.