గంగమ్మ ఒడిలో సింగిడి పూలవనం

Written by telangana jyothi

Published on:

గంగమ్మ ఒడిలో సింగిడి పూలవనం

– పూలమ్మ పరిమళింపు.. తోగుంట మురిపెం

— గ్రామ గ్రామాన చెరువుగట్లపై ఆడపడుచుల సందడి

– ములుగు జిల్లాలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

ములుగు ప్రతినిధి : ముగిసిన పూల సింగిడి.. పరవశించిన గంగమ్మ.. ములుగు జిల్లా వ్యాప్తంగా ఊరంతా ఒక్కటై ఆడి పాడిన ఆడపడుచులు.. తీరొక్క పూల జాతర కన్నుల పండు వగా మెరిసింది.. తొమ్మిదిరోజుల పండుగలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మగా గౌరమ్మను కొలుచుకున్నఆడపడుచుల సంబురాలు అంబరాన్నంటాయి. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించ డం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవే ద్యాన్ని మహిళలే తయారుచేస్తారు. ఇలా రోజుకో నైవేద్యంతో అమ్మవారిని కొలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సత్తుముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు పండుగపూట సొంత గూటికి వచ్చి చేరడంతో కుటుంబాలు సంతోషంతో నిండిపోయాయి. కొత్త బట్టలు ధరించి ప్రతీ ఇంటి ఆడబిడ్డ పోటీపడుతూ తీరొక్క పూలను కోసుకొచ్చి బతుకమ్మలను తయారు చేసి సమీపం లోని వాగులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉయ్యాల, గౌరమ్మ పాటలతో డీజే శబ్దాల నడుమ ఆడి పాడారు. గౌరమ్మ గౌరమ్మ కోల్ అంటూ సామూహికంగా ఆడి పాడుతూ హుషారుగా గడిపారు. ములుగులో గ్రామపంచా యతీ ఆధ్వర్యంలో తోగ్గుంట వద్ద భారీ ఏర్పాట్లు చేపట్టారు. పత్తిపల్లి రోడ్డులో సామూహికంగా బతుకమ్మలతో ఆడపడు చులు వెళుతున్న దృశ్యాలు అబ్బురపరిచాయి. చిన్నారులు, యువతులు బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. అనంతరం తోగ్గుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తొమ్మిదిరోజు బతుకమ్మలు వదిలిన నీటి ప్రాంతాల న్నీ పూలతో నిండిపోయి కొత్త చీర కట్టుకున్న గంగమ్మలా కనువిందు చేస్తున్నాయి. ప్రతీ ఇంటిలోనూ అందరి ముఖాలు కళకళలాడతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. ఉత్సవాల సందర్భంగా ఎంపీవో రహీమోద్దీన్, జీపీ కార్యదర్వి పి.రఘు ఆధ్వర్యంలో కట్టపై ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంగటనలు జరుగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ శంకర్,ఎస్సై వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now