కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి మండల పరిధిలోని సూరవీడు పంచా యతీ విజయపురి కాలనీ సమీపంలో చత్తీస్గడ్ వెళ్లే కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఓవర్ లోడింగ్ తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి వాహనదారుడు బండి కాగితాలు కలిగి ఉండాలని, రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై వాహనదారులకు, అవగాహన కల్ఫించారు. వాహ నాల తనిఖీలలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, ప్రొబేషనరి ఎస్సై ఆంజనేయు లు, ఆలు బాక సిఆర్పిఎఫ్ సిబ్బంది, మరియు సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.