ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్న సింగరేణి అధికారులు
– బానిసత్వంలో క్రూర నిర్బంధంలో కార్మిక వర్గం
– చోద్యం చూస్తున్న గుర్తింపు ప్రాతినిత్య సంఘాల నాయకులు
– తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: ఆధిపత్య ధోరణితో సింగరేణి అధికారులు వ్యవహరిస్తున్నారని, బానిస త్వంలో క్రూర నిర్బంధంలో కార్మిక వర్గం పనిచేస్తున్నారని, గుర్తింపు ప్రాతినిత్య సంఘాల నాయకులు చోద్యం చూస్తు న్నట్లు ఉందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని బాతాల రాజన్న భవన్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగి 7, నెలలకు కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం రాకపోవడంలో అంత రాయం ఏమిటని ప్రశ్నించారు. గెలుపొందిన సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదు. వారి పై రోగులు వారి వ్యక్తిగత పనులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి దీన్ని ఆసరా చేసుకుని సింగరేణిలో సింగరేణి వ్యాప్తంగా అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తూనరు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు విషయంలో గని స్థాయి అధికారులకు చెప్పుకుం దామంటే వారు స్పందించడం లేదు గనిస్తాయి అధికారులు మేము ఏమి చేయలేము మా పై అధికారులు జిఎం స్థాయిలో మాట్లాడుకోండి ఏమైనా సమస్యలు ఉంటే అంటూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇట్టి విషయంలో జి ఎం స్థాయి అధికారులకు చెప్పుకుందామంటే కనీసం కార్మికులను గేటు కాడికి కూడా రానివ్వడం లేదు వివిధ ఆంక్షలు పెడుతూ కార్మిక కుటుంబాలను వీణంగా చూస్తున్నా రు సింగరేణి సంస్థలో సింగరేణిలో ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో స్మృతులు రాస్తు ఉంటారు అ స్లోగన్స్ కేవలం అధికారులకు సింగరేణిలో గుర్తింపు ప్రాతినిత్య సంఘాల నాయకులకు మాత్రమే వర్తిస్తున్నాయి సింగరేణి మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఎన్ బాలరాం నాయక్ కార్మికులు తమ సమస్యలను విన్నవించు కుందామని హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కి వెళ్తే డైరెక్టర్ గారు వెంటనేస్పందిచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా అనుకూలంగా స్పందిస్తూన్నారు కానీ క్రింది స్థాయి అధికారులు మాత్రం కార్మికుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు కొన్ని సందర్భాలలో సీఎన్ఎండి ఎన్ బలరాం గారు సింగరేణి సంస్థ డెవలప్మెంట్ కోసం కార్మిక హక్కుల కోసం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సింగరేణిలో రిజిస్టర్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాడు అలాంటిది జీఎం స్థాయి అధికారులు మాత్రం వారి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలాంటి అధికారుల పైన సింగరేణి డైరెక్టర్ గారు తగుచర్యలు తీసుకోవాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరు కుంటుంది.ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల పక్షాన నిలబడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో (టి ఎస్ యు ఎస్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, నాయకులు దాసరి జనార్ధన్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్ల బండి బాబు, కే లింగన్న, వేరంటి శ్రీధర్, జయశంకర్ కే మధుకర్ విజయ్, ఎండి సాజిద్ తదితరులు పాల్గొన్నారు.