స.హ చట్టం పరిరక్షణ కమిటీ మండల సహాయ కార్యదర్శిగా దార కుమారస్వామి

స.హ చట్టం పరిరక్షణ కమిటీ మండల సహాయ కార్యదర్శిగా దార కుమారస్వామి

తెలంగాణ జ్యోతి, దుగ్గొండి : దుగ్గొండి మండల సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మండల సహాయ కార్యదర్శిగా దార కుమారస్వామిని నియమిస్తున్నట్లు మండల అధ్యక్షుడు గూడపు అమరేందర్ ప్రధాన కార్యదర్శి నామిండ్ల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు దార కుమారస్వామిని మండల సహాయ కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే చట్టాలు అబాసుపాలౌతాయో అక్కడ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ప్రతినిధులుగా తాము ప్రశ్నిస్తామన్నారు. ఏ సమాచారమైనా పౌరులు అడిగితే ఏ అధికారి అయినా 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, ఇవ్వని ఎడల ఆ అధికారులపై 2005 సమాచార హక్కు చట్టం ద్వారా వారిపై కేసులు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టవచ్చన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల ఉపాధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment