మానవత్వం చాటుకున్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇతర రాష్ట్రానికి చెందిన వృద్దురాలు భిక్షాట న చేస్తూ గత కొంత కాలంగా మండలంలో జీవనం కొనసాగిస్తుంది.మంగళవారం ఉదయం ఏటూరునాగారం నుంచి తాడ్వాయి వైపు వెళుతు న్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కి రోడ్డు పై దిన స్థితి లో ఉన్న మహిళ వృద్దురాలు కనిపించగా, దగ్గరకి వెళ్లి చూస్తే వృద్ధురాలి కాలికి గాయమై ఉండడం గమనించి చికిత్స అందించి తగిన ఆహా రం అందచేశారు. మహిళ గురించి ఆరా తీయగా ఆమె గత కొన్ని సంవత్సరా లుగా చిన్నబోయినపల్లి లో ఉంటుంది అని తెలిసింది. వృద్ధ మహి ళతో ఎస్సై మాట్లాడి వృద్ధాశ్రమం కి పంపడం కోసం ఎంత అడిగినప్పటికి తాను అదే గ్రామంలో ఉంటానని వృద్ధ ఆశ్ర మంకి వెళ్లడానికి నిరాకరించినది. సమయానికి అటవీ ప్రాంతంలో రోడ్ కల్వర్ట్ వద్ద అపాయం లో ఉన్న వృద్ధ మహిళను కాపాడి గాయానికి చికిత్స చేయిం చి, భోజనం పెట్టించిన తాడ్వాయి పోలీసులను గ్రామస్థులు అభినందించారు.