ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అరికట్టాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ భూమి పుత్ర ఆదివాసి సంఘం డిమాండ్ సమావేశం మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్ర రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ టి ఆర్ 1/59, 1/70 భూ బదలాయింపు నిషేధిత చట్టాలను వలస గిరిజనేతరులు ఉల్లంఘించి, గ్రామపంచాయతీ అధికారుల అనుమతి తీసు కోకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి, చట్ట విరుద్ధంగా బహుళ అంతస్తు నిర్మాణాలు చేపడుతున్నా రన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో గిరిజనేతరులు వలసలు నిషేధం అని తెలిసిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి, చట్ట విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకనే ఏజెన్సీ ప్రాంతంలోకి విపరీతమైన గిరిజనేతర వలసలు పెరిగిపోతున్నారని, ఇక్కడ భూముల ను క్రయ,విక్రయాలు చట్ట విరుద్ధంగా జరిపి బహుళ అంతస్తు నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇదంతా అధికా రుల నిర్లక్ష్య వైఖరితోటే జరుగుతుందని ఆయన అన్నారు . హైదరాబాద్ సిటీలో హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల కబ్జా అక్రమ కట్టడాలపై కొరడా గులిపించిన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో చట్ట విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపిం చుకోవాలని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వలసలు పెరిగిపోతున్నారని, వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఓటు హక్కు,ఇంటి పన్ను కరెంటు మీటరు ఇవ్వకూడదని ఆయన అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో అనుమ తులు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలపై విచారణ జరిపి తక్షణమే వాటిని కూల్చివేయాలని ఆయన అధికారులు ను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పూనం మునేశ్వరరావు, తాటి లక్ష్మణ్ ,కోరం సందీప్, మద్ద నరసింహారావు, పూనం పవన్ కుమార్, శంకర్, మడకం ఆదయ, సోడీ ధనలక్ష్మి, చీమల నర్సమ్మ, మేడం సూరయ్య తదితరులు పాల్గొన్నారు.