శ్రీ వరలక్ష్మి వ్రతం రెండవ శ్రావణ శుక్రవారం 

Written by telangana jyothi

Published on:

శ్రీ వరలక్ష్మి వ్రతం రెండవ శ్రావణ శుక్రవారం 

– భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రెండవ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడేఇ. ఇళ్ళు ను ఒకరోజు ముందుగానే శుభ్రంగా కడిగి శుభ్రం చేశారు ఇల్లు వాకిళ్లలో శుక్రవారం వేకువజాము నుండే ముత్యాలముగ్గులు రంగవల్లులతో ఆయా గృహాలు సోదరీమణులు పవిత్రమైన ఆవు పేడతో కల్లాపులు జల్లి అందంగా వాకిళ్లను అలంకరించారు. పుణ్య స్నానాలు చేసిన భక్తులు,శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వ్రతంలో కావలసిన పూజా సామాగ్రి, పిండివంటలు, పులిహార, పాయసం తదితర వంటకాలను నైవేద్యంగా సమర్పించి, శ్రీ వర లక్ష్మి మహాతల్లికి నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబాలతో సహా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం కనకదుర్గమ్మ వెంకటేశ్వర స్వామి, దేవాలయాలతో పాటు ఇతర మందిరాలు ,తో పాటు బెస్త గూడెం గ్రామాల్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ రామాలయం తో పాటు వాజేడు మండలంలోని అనేక దేవాలయాల్లో వేకువ జామునుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పరస్పరం ప్రసాదాలను పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రత మహత్యం తెలుగు పుస్తకాలను పూజా మందిరంలో చదివి అమ్మవారికి పసుపు, కుంకాలతో, పుష్షాలతో హారతి ఇచ్చి, పాడి పంటలు సక్రమంగా పండాలని, సకజనులు సుక సుఖశాంతులతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలని, భక్తురాళ్ళు సోదరీమణులు అమ్మవారిని పూజలలో వేడుకున్నారు.

Leave a comment